తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో మరో 66 కేసులు నమోదు అయ్యాయి. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న లెక్క‌ల‌ను బ‌ట్టి చూస్తే రాష్ట్రం మొత్తం 766 కరోనా కేసులు.. రాష్ట్రంలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లో 417 కేసులు రికార్డయ్యాయి. వీటిలో 
రాష్ట్రం మొత్తం మీద 186 మంది డిశ్చార్జ్ కాగా, అందులో 131 మంది హైదరాబాద్ వాసులున్నారు.

 

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రం మొత్తం మీద 13 జిల్లాలో 209 క్లస్టర్లలో 1, 09, 975 గృహాల్లో 4 లక్షల 39 వేల 900 మందిని వైద్య సిబ్బంది సర్వే చేయడం జరిగిందని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న జిల్లాల్లోనే కాకుండా కొత్త జిల్లాల్లో కూడా క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో మరో రెండు కరోనా కేసులు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లాలో మరో 15 కేసులు నమోదు కావడం జిల్లా వాసులను కలవర పెడుతోంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: