కరోనా వంటి కష్ట సమయంలో చాలా మంది దాతలు పేదలకు అండగా నిలుస్తూ సాయం చేస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ రోజు ఆయన మన్‌ కీ బాత్‌లో ప్రజలతో మాట్లాడారు.  ముఖానికి మాస్క్‌లు ధ‌రించ‌డం మ‌న జీవితాల్లో భాగ‌మైన‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. ఇవాళ ఆయ‌న మ‌న్‌కీ బాత్ రేడియో కార్య‌క్ర‌మం‌లో మాట్లాడారు. మాస్క్‌లు ధ‌రించిన వారిని రోగులుగా చూడ‌కూడ‌ద‌ని, నాగ‌రిక స‌మాజానికి మాస్క్‌లు చిహ్నంగా మారాయ‌న్నారు. 

 

కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అద్భుతంగా పనిచేస్తున్నాయని తెలిపారు.  ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమానికి ప్రజలు బాసటగా నిలిచారని మోదీ చెప్పారు.  మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకోవాల‌న్నా, లేక ఇత‌రుల్ని వ్యాధి నుంచి కాపాడాల‌న్నా.. మాస్క్‌లు ధ‌రించ‌డం చాలా ముఖ్య‌మ‌న్నారు. 

 

బ‌హిరంగ స్థ‌లాల్లో ఉమ్మివేస్తే క‌లిగే అన‌ర్ధాల ప‌ట్ల ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెరిగింద‌ని మోదీ అన్నారు.  కోవిడ్‌19 మ‌హమ్మారిని అరిక‌ట్ట‌డంలో రాష్ట్ర ప్ర‌భుత్వాలు చూపిన చొర‌వ‌ను ప్ర‌ధాని మెచ్చుకున్నారు.  ఇప్పుడు కరోనా సృష్టించిన విలయాన్ని అధిగమించేందుకు అన్ని వర్గాల ప్రజలు కొత్త తరహా విధానాల వైపు మళ్లారని ప్రశంసించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: