దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకీ పెరిగిపోతుంది.. ఈ నేపథ్యంలో మార్చి లో లాక్ డౌన్ మొదలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మద్యం షాపులు, క్లబ్, బార్ అండ్ రెస్టారెంట్స్ అన్నీ క్లోజ్ చేశారు.  దాంతో మందు బాబుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది.  మొన్నటి నుంచి గ్రీన్, ఆరంజ్ జోన్లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మద్యం దుకాణాల ముందు క్యూ లైన్ బౌతిక ధూరం మాస్క్ ధరించాలాని ఆంక్షలు పెట్టారు.  కానీ మందు బాబులకు ఇవేం పట్టనట్టు ప్రవర్తించడం పై పలు విమర్శలు వస్తున్నాయి.  ఇన్నాళ్లు ఇంటి పట్టున ఉండి లాక్ డౌన్ సంపూర్ణంగా పాటించనవారు.. ఇప్పుడు రోడ్లపైకి వచ్చి మళ్లీ కరోనా వ్యాప్తికి శ్రీకారం చుడుతున్నారని విపక్షాలు, మహిళా సంఘాలు గగ్గోలు పెడుతున్నారు. 

 


ఇదిలా ఉంటే.. దేశంలోని అన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలు తెరచుకునేందుకు అనుమతించగా, ముంబై వాసులకు మాత్రం అది రెండు రోజుల ముచ్చటగానే నిలిచింది. వైన్స్ షాపుల వద్ద ప్రజలు భౌతిక దూరాన్ని మరవడంతో, తీవ్రంగా స్పందించిన బృహన్ ముంబయి కార్పొరేషన్ అధికారులు, మద్యం దుకాణాలను నేటి నుంచి తెరవరాదని ఆదేశాలు జారీ చేశారు. దేశంలో అత్యధికంగా కరోనా కేసులు మహరాష్ట్రలో నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా  ముంబైలో తాజాగా 500కు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో, మొత్తం కేసుల సంఖ్య 9 వేలను దాటేసింది. మొత్తం మీద రాష్ట్రంలో కేసుల సంఖ్య 15 వేలను దాటడంతో ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలను తీసుకోవాలని భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: