కేంద్ర హోం శాఖ మమత సర్కార్ పై మరోసారి సీరియస్ అయింది. మమత సర్కారు ఇండో- బంగ్లా సరిహద్దుల్లో నిత్యావసర సరుకుల రవాణాకు అనుమతి ఇవ్వలేదు. దీంతో కేంద్ర హోం శాఖ ఇలాంటి చర్యల వల్ల అంతర్జాతీయ సంబంధాలు దెబ్బ తినే అవకాశం ఉందని... మమత సర్కార్ విపత్తు నిర్వహణ చట్టానికి తూట్లు పొడుస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. 
 
బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ సిన్హాకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఇండో- బంగ్లా, ఇండో - భూటాన్, ఇండో - నేపాల్ సరిహద్దు మార్గాల గుండా నిత్యావసర సరుకుల రవాణాకు అనుమతించాలని గత నెలలోనే ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశామని లేఖ రాశారు. అజయ భల్లా తన లేఖలో బెంగాల్ దగ్గర సరుకుల రవాణా ఆపేసినట్టు సమాచారం వచ్చిందని పేర్కొన్నారు. పొరుగు దేశాలతో ఉన్న ఒప్పందాల ప్రకారం సరుకుల రవాణాను ఆపడానికి వీలు లేదని అజయ్ భల్లా లేఖలో పేర్కొన్నారు. గతంలో పలు సందర్భాల్లో కేంద్రం మమత సర్కార్ పై సీరియస్ అయిన సంగతి తెలిసిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: