తెలుగు చిత్ర సీమలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పంచిన ప్రముఖ నటి వాణిశ్రీ ఇంట విషాదం చోటు చేసుకుంది.   సినీ నటి వాణిశ్రీ కుమారుడు డా.అభినయ్ వెంకటేశ్ (36) మృతి చెందిన విషయం తెలిసిందే.  అయితే, ఆయన గుండెపోటుతో మరణించలేదని, ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలో నివాసం ఉంటోన్న ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. తన నివాసంలో నిద్రలోనే ఆయన మృతి చెందినట్లు వివరించారు. వాణిశ్రీకి అభినయ్ తో పాటు, ఓ కుమార్తె కూడా ఉన్నారు.

 

చెన్నైలోని అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో డాక్టర్ గా పనిచేస్తున్న ఆయనకు భార్య, ఓ కుమారుడు (4), కుమార్తె  ఉన్నారు. ఆయన భార్య కూడా వైద్యురాలే. అయితే అభినయ్  తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లా తిరుక్కలింకుండ్రంలోని తమ ఫాంహౌస్‌లో ఆయన ఈ ఘటనలు పాల్పడ్డాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆయన ఇంటి వద్దే ఉంటున్నాడు. గత కొన్ని రోజులుగా పలు సమస్యల కారణంగా కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్నాడు. ఆయన గుండెపోటుతో మృతి చెందాడని ముందుగా వార్తలు వచ్చాయి. ఆయన ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. తిరుక్కలి కుండ్రమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు. అయితే ఈ విషయం గురించి ఇంకా ఎలాంటి స్పష్టత రాకపోవడంపై పలు అనుమానాలు వస్తున్నాయని అంటున్నారు సినీ ఇండస్ట్రీ.
 

మరింత సమాచారం తెలుసుకోండి: