యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడికల్ ఫిక్షన్ మూవీ " ఆర్.ఆర్.ఆర్ " నుండి కొమరం భీమ్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక పోస్టర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బల్లెం చేతపట్టుకొని వీరత్వంతో ఉన్నాడు. ఇక ఈ పోస్టర్ పై తారక్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే సినిమాలో తను చేస్తున్న కొమరం భీమ్ పాత్ర గురించి తారక్ ఆసక్తికరంగా ట్విట్టర్ లో స్పందించాడు. తాను చేస్తున్న ఈ రోల్ ను మీకు అందరికీ పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని అలాగే తాను చేస్తున్న ఈ కొమురం భీం పాత్ర తన కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని తారక్ ట్వీట్ చేశాడు. మరి ఈ కొమరం భీమ్ రోల్ లో తారక్ విశ్వరూపం ఎలా ఉంటుందో ఇది వరకే టీజర్ లో చూసాము. షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ తో ప్రతి ఒక్కరిని స్టన్ చేసాడు. మరి ఈ ఫుల్ సినిమాలో ఎలా ఉండనున్నాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: