తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభుత్వ కార్యాలయాలు కూడా నీట మునుగుతున్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టరేట్ భవనం నీటితో నిండిపోయింది. సీఎం కేసీఆర్ ఇటీవలే ఈ కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అయితే 18 రోజులు గడవక ముందే భవనం పై నుండి లీకులు నీటితో సముదాయం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం నూతనంగా ఏర్పడిన సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ భవనాన్ని నిర్మించారు.

ఈ భవనంలో అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. డిజైన్ కూడా దానికి అనుగుణంగా రూపొందించారు. కాగా గురువారం కురిసిన భారీ వర్షాలతో ఇప్పుడు కలెక్టరేట్ ఆవరణ అంతా వరద నీటితో నిండిపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలే ఇలా కట్టిస్తే పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎలా కట్టిస్తారు అని  కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kcr