
కథానాయకుడు కార్తికేయకు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఎవర్ని మనువాడబోతున్నాడా అంటూ అభిమానులు ఆసక్తిగా వివరాలు తెలుసుకుందామని నిన్నటి నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ ఈరోజు వివరాలు వెల్లడించారు కార్తికేయ. తాను వరంగల్ ఎన్ ఐటీ వరంగల్‌లో చదువుతున్నప్పుడు ఇద్దరికీ పరిచయమైందని, తన పేరు లోహిత అని తెలిపారు. తన స్నేహితురాలే తన జీవితంలోకి భాగస్వామిగా వస్తుందని అనుకోలేదని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉందన్నారు. 2010 నుంచి ఇద్దరికీ పరిచయం ఉందని చెప్పారు. తనను తొలిసారిగా కలిసింది కూడా వరంగల్ ఎన్ ఐటీలోనేని తెలిపారు. చావుకబురు చల్లగా సినిమాతో ఇటీవల అభిమానులను పలకరించిన కార్తికేయ ఆర్ ఎక్స్ 100 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా అజిత్ కథానాయకుడిగా వస్తున్న వాలిమై చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. కథానాయకుడిగానే కాకుండా విభిన్నమైన పాత్రలు చేస్తూ అందరినీ ఆలరించాలనేది తన కోరిక అన్నారు.