ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా సినిమా టికెట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక వెబ్సైట్ ను ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకోవడం పట్ల తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. ఈ నిర్ణయం పట్ల సినిమా ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పొరుగు రాష్ట్రాలు కూడా ఈ నిర్ణయం విషయంలో షాక్ అయ్యాయి.

ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏమిటి అనేది తెలియక పోయినా త్వరలోనే దీనికి సంబంధించి కొంత మంది సినిమా నిర్మాతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉండొచ్చని తెలుస్తోంది. సినిమా టికెట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటే నిర్మాతలు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు. అందుకనే ఇప్పుడు దీనికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: