ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు ఉంటాయని ఆయన అన్నారు. మంత్రివర్గంలో వంద శాతం మార్పులు ఉంటాయని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గతంలో చెప్పిన విషయాన్ని మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి గుర్తు చేశారు ప్రభుత్వ విధానాలు సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ముఖ్యమంత్రితో తాను ఇప్పటికే చెప్పానని ఆయన వెల్లడించారు. మంత్రి పదవి పోయినా నేను భయపడేది లేదని బాలినేని స్పష్టం చేశారు. పదవులు కాదు ముఖ్యం నాకు పార్టీ ముఖ్యమని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నిక సందర్భంగా జరిగిన సమావేశానికి మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందన్న నేపథ్యంలో తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: