ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంట‌ర్మీడియ‌ట్ స‌ప్ల‌మెంట‌రీ ప‌రీక్ష ఫలితాలు శ‌నివారం సాయంత్రం విడుద‌ల‌య్యాయి.   ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రాలకు సంబంధించిన అడ్డాన్స్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫ‌లితాల‌ను ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ విడుద‌ల చేశారు.  ఇంట‌ర్ స‌ప్ల‌మెంట‌రీ ప‌రీక్ష‌లు మొద‌టి, ద్వితీయ సంవ‌త్స‌రం విద్యార్థుల‌కు సెప్టెంబ‌ర్ 15 నుండి 23 వ‌ర‌కు నిర్వ‌హించారు. విద్యార్థులు bie.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా త‌మ షార్ట్ మెమోల‌ను పొంద‌వ‌చ్చు. ప‌లితాల‌కు సంబంధించి గ్రీవెన్స్‌ను  ourbieap@gmail.com  వెబ్‌సైట్ లేదా 391282578 వాట్సాప్ నెంబ‌ర్‌కు సంప్ర‌దించొచ్చ‌ని వెల్ల‌డించారు.

మొద‌టిసారి ఈ ఏడాది ప్ర‌యోగాత్మ‌కంగా వృత్తివిద్య‌, కొన్ని మైన‌ర్ స‌బ్జెక్టుల‌ను ఆన్‌లైన్‌లో మూల్యాంక‌నం చేశారు. అక్టోబ‌ర్ 26 నుంచి న‌వంబ‌ర్ 02 వ‌ర‌కు స‌మాధాన ప‌త్రాల రీ వాల్యూవేష‌న్, ప‌రిశీల‌న‌కు అవ‌కాశం క‌ల్పించిన‌ట్టు తెలిపారు.   ఒక్కో పేప‌ర్‌కు రివాల్యూవేష‌న్‌కు రూ.260, స్కాన్‌కాఫీ, పునఃప‌రిశీల‌న‌కు రూ.1300 చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు  ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకునే వెసులుబాటు క‌ల‌దు. స్కానింగ్ ఆన్స‌ర్ షీట్ కూడ ఆన్‌లైన్‌లోనే ల‌భ్యం కానుంది.  రాష్ట్రవ్యాప్తంగా మొద‌టి సంవ‌త్స‌రం విద్యార్థులు 3,24,800 మంది, రెండో సంవ‌త్స‌రం విద్యార్థులు 14,950 మంది విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: