మాదకద్రవ్యాల హబ్‌ గా ఏపీ.. అంటూ ఇతర రాష్ట్రాల పోలీసులు చేసిన వ్యాఖ్యల వీడియో లతో పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్ లు చేయడం సంచలనం అయింది. ఏపీ నుండే గంజాయి ఇతర రాష్ట్రాలకు వెళ్తుంది అన్న పోలీసు అధికారులు వీడియో లు పెట్టారు పవన్ కళ్యాణ్. ఏపీలో గంజాయి మూలాలున్నాయంటూ హైదరాబాద్‌ సీపీ, నల్గొండ ఎస్పీ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర పోలీసు అధికారులు చేసిన వ్యాఖ్యల వీడియోలను పవన్ కళ్యాణ్ పోస్ట్ చేసారు.

ఏపీ నార్కోటిక్స్ హబ్‌గా మారింది అని ఆయన ఆరోపించారు.  ఇది దేశం మొత్తం ప్రభావం చూపుతోంది అని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వ ఇన్‌ఛార్జ్‌ లుగా ఉన్న నాయకులు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని రంగనాధ్ మాటలతో అర్ధమవుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. గంజాయి నివారణకు నేతలు చర్యలు తీసుకోవట్లేద అన్నారు పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: