రెండేళ్ళ క్రితం దిశా ఘటన జరిగిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఆసక్తిగా మారాయి. దిశా ఘటన తర్వాత జరిగిన కాల్పుల ఘటన జాతీయ స్థాయిలో సంచలనం అయింది. ఇక ఈ కేసు విషయంలో ప్రస్తుతం సుప్రీం కోర్ట్ ఏర్పాటు చేసిన కమిటీ విచారణ జరుపుతుంది. దీనికి సంబంధించి తెలంగాణా హైకోర్ట్ లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా దిశ కమిషన్ విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు.

దిశ కమిషన్ విచారణ తీరుపై దాఖలైన పిటిషన్లు కొట్టి వేసింది. డీఎస్పీ సురేందర్, సీఐ నర్సింహారెడ్డి పిటిషన్లు కొట్టివేసింది తెలంగాణా హైకోర్ట్. దిశ కమిషన్ విచారణ చట్ట విరుద్దంగా జరుగుతోందనే వాదనను తెలంగాణా హైకోర్ట్ తోసిపుచ్చింది. తమను చివరగా విచారణ జరిపేలా ఆదేశించాలనే అభ్యర్థనను నిరాకరించిన హైకోర్టు.. విచారణ తీరును నిర్ణయించుకునే అధికారం కమిషన్ కు ఉంటుందని తెలంగాణా హైకోర్ట్ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts