మలయాళంలో విజయవంతమైన 'దృశ్యం 2' తెలుగులోనూ అదే పేరుతో రూపొందించారు. ఇందులో హీరో వెంక‌టేష్‌, హీరోయిన్ మీన ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. చాలా కాలం క్రిత‌మే చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న‌ది. క‌రోనా కార‌ణంగా ప‌లుమార్లు ఈ సినిమా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఈ త‌రుణంలోనే ఈ సినిమాను ఓటీటీలో విడుద‌ల చేసేందుకు చిత్ర‌బృందం సిద్ధ‌మైన‌ది. దృశ్యం-2 చిత్రాన్ని న‌వంబ‌ర్ 25న అమెజార్ ప్రైమ్‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్ తాజాగా ప్ర‌క‌టించిన‌ది.

మోహన్ లాల్ ప్రధానపాత్రలో రూపొందిన మలయాళ హిట్ చిత్రం ‘దృశ్యం 2’ సినిమాకు రీమేక్  ఈ చిత్రం ఇది..  మాతృకకు దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ ఈ సినిమాను కూడ  రూపొందించడం విశేషం. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. తాజాగా ఈ  సినిమాకు సంబంధించిన టీజ‌ర్‌ను విడుద‌ల చేసారు. ఇటీవలే ‘నారప్ప’ సినిమాతో ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు విక్ట‌రీ వెంక‌టేష్‌. తన నటనతో నార‌ప్ప‌లో  వెంకటేష్ మంచి మార్కులే కొట్టేసారు. ఇదిలా ఉండగా వెంకటేష్ ప్రస్తుతం ‘ఎఫ్ 3’ సినిమాలో నటిస్తున్న విష‌యం తెలిసిన‌దే.  ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానున్న‌ది. మరోవైపు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్ ఓ సినిమా చేయనున్నారని గతంలో ప్రచారం జరిగిన‌ది. కానీ దాని గురించి  అధికారిక ప్రకటన రావాల్సిఉంది.
 



మరింత సమాచారం తెలుసుకోండి: