భారీ వర్షాల దెబ్బకు తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ కూడా చాలా ఇబ్బంది పడుతుంది. అల్పపీడనం క్రమంగా బలపడుతున్న నేపధ్యంలో అధికారులు కూడా అలెర్ట్ అయ్యారు. భారీ వర్షం కారణంగా రెండు ఘాట్ రోడ్లు మూసివేసారు టీటీడీ అధికారులు. ఘాట్ రోడ్ లో విరిగి పడుతున్న కొండ చరియలు అధికారులను కంగారు పెడుతున్నాయి.

హరిణికి సమీపంలో రహదారిపై కూలిన చెట్టుని వెంటనే తొలగించే ప్రయత్నం చేసారు. తిరుమల రెండో ఘాట్ రోడ్ లో వాహనాలు నిలిచిపోయాయి. కొండ పైనుంచి రోడ్డుపైకి కొట్టుకొచ్చిన మట్టి, రాళ్లు ఇబ్బందిగా మారాయి. రెండు ఘాట్ రోడ్ లో,మెట్ల మార్గంలో భారీగా వరద ప్రవాహం ఉందని తెలుస్తుంది. ఘాట్ రోడ్డులో పడిన రాళ్లు తొలగించేందుకు టీటీడీ సిబ్బంది చర్యలు చేపట్టారు అని అధికారులు పేర్కొన్నారు. భారీ వర్షంతో ప్రమాదకరంగా రెండవ ఘాట్ రోడ్ మారినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: