బిసిసెన్స‌స్ పై తీర్మానాన్ని స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన బిసి సంక్షేమ శాఖామంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ‌ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపిలోని బిసిల‌కు భ‌ద్ర‌త క‌ల్పించేది ఈ తీర్మానం అని ఆయన పేర్కొన్నారు. వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తులు స‌మాజానికి వెన్నెముఖ అయినా వారికి త‌గిన ప్రాధన్యం, ఫ‌లాలు అంద‌డంలేదు అని అన్నారు. వెనుక‌బ‌డిని త‌ర‌గ‌తుల‌కు సంభందించి జ‌నాభా గ‌ణ‌ణ కోసం ఈ తీర్మాణం ఉద్దేశించింది అని ఆయన తెలిపారు.

భార‌త‌దేశంలో చివ‌రి సారిగా కుల‌గ‌ణ‌ణ 1931 లో  జ‌రిగింది అని అప్ప‌ట్లో భార‌త‌దేశ జానాభా 30 కోట్లు, అందులో  పాకిస్ధాన్, బంగ్లాదేశ్ జ‌నాభా కూడా ఈ లెక్క‌ల్లో క‌ల‌సి ఉన్నాయి అన్నారు. ఈ గ‌ణ‌ణ మూలంగా నిజ‌మ‌య‌న ల‌బ్దిదారుని గుర్తింపుకు ఉప‌యోగ‌ప‌డుతుంది అని వివరించారు. జ‌న‌గ‌ణ‌ణ ప‌ది సంవత్సార‌ల‌కు ఒక సారి లెక్కిస్తారు అని  అయితే బిసి జ‌న‌గ‌ణ‌న మాత్రం జ‌ర‌గ‌డం లేదు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap