ఉపాధి హామీ బిల్లులకు సంబంధించి ఏడాది నుంచి కాస్త వివాదం కొనసాగుతుంది. ఈ వివాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్ట్ అసహనం కూడా వ్యక్తం చేసింది. ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపు పై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. బిల్లులు చెల్లించడం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకు వచ్చిన న్యాయవాదుల వాదనలను ధర్మాసనం విన్నది. నాలుగు వారాల లోపు బిల్లులు చెల్లించకపోతే బిల్లుల మొత్తంపై వడ్డీని రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు వర్తించవని ధర్మాసనం స్పష్టం చేసింది.

తమకు బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని ధర్మాసనం కి న్యాయవాదులు వివరించారు. వడ్డీని రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని న్యాయవాదులు విజ్ఞప్తి చేసారు.  నాలుగు వారాల్లో చెల్లించకపోతే వడ్డీ రద్దు ఉత్తర్వులు ఆటోమేటిక్ గా రద్దయిపోతాయని స్పష్టం చేసిన ధర్మాసనం... కేసు విచారణను వాయిదా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap