ఎవ్వ‌రైనా ఏదైనా జ‌ర‌గ‌కూడ‌ని సంఘ‌ట‌న జ‌రిగితే త‌ప్ప పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తుంటారు. దొంగ‌తం, మ‌ర్డ‌ర్‌, కిడ్నాప్ లాంటి కేసుల్లో చాలా మంది పోలీస్ స్టేష‌న్ గ‌డ‌ప తొక్కుతుంటారు. భూత‌గాదాలు జ‌రిగిన‌ప్పుడు, యాక్సిడెంట్‌లు జ‌రిగిన‌ప్పుడే వెళ్తారు. ఈ మ‌ధ్య‌కాలంలో గేదె పాలు ఇవ్వ‌డం లేద‌ని, దెయ్యం తిరుగుతుంది అని, కొంత‌మంది పోలీస్ స్టేష‌న్ కువెళ్లి ఫిర్యాదులు చేస్తూ.. ఉన్నారు.

తాజాగా త‌మ పెన్సిల్ పోయింద‌ని కొంత మంది చిన్నారులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లారు. ఈ ఘ‌ట‌న ఏపీలోని క‌ర్నూలు జిల్లా పెద‌క‌డుబూరులో చోటు చేసుకున్న‌ది. త‌న పెన్సిల్‌ను తోటి విద్యార్థి దొంగ‌త‌నం చేసాడ‌ని హ‌న్మంత్ అనే బాలుడు పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద‌కు  వెళ్లాడు. త‌న పెన్సిల్‌ను దొంగిలించిన వారిపై  పోలీస్ కేసు పెట్టాల‌ని పోలీసుల‌ను కోరాడు. దీనిపై స్పందించిన పోలీసులు అతనికి న‌చ్చ‌జెప్పి అక్క‌డి నుంచి పంపించారు. పెన్సిల్ పోయింద‌ని పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన ఘ‌ట‌న ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన ప‌లువురు జోక్ అని న‌వ్వుకుంటున్నారు.మరింత సమాచారం తెలుసుకోండి: