కొన్ని ప్రమాద సంఘటనలు విచిత్రంగా ఉంటాయి. హమ్మయ్యా బయటపడ్డామని అనుకునే లోపే మరో ప్రమాదం చోటు చేసుకుంటూ ఉంటుంది. దాని నుంచి తప్పించుకుంటే హమ్మయ్యా ప్రాణాలు దక్కాయని ఊపిరి పీల్చుకుంటూ ఉంటాం. ఇలాంటి ఘటనలు ఎక్కువగా కొన్ని సాహసయాత్రలు చేసే వారికి లేదంటే ఆఫ్రికా సఫారీల ప్రయాణం చేసే వారికి తరుచుగా ఎదరవుతూ ఉంటాయి. కానీ ఆఫ్రికా అడవుల్లో కొంతమంది టూరిస్టులతో ప్రయాణం చేస్తున్న కారు ఓ గుంతలో ఇరుక్కుంది. ఈ విషయం గమనించిన ఓ టూరీస్ట్ గైడ్ కారుకు తాడు కట్టి దాని సాయంతో గుంతలోంచి కారును బయటికి తీసారు.
కారు బయటికి రాగానే అకస్మాత్తుగా అక్కడికి ఓ సింహం వచ్చింది. దానిని చూసిన ప్రయాణికులు భయపడి వెంటనే కారులోకి ఎక్కేశారు. అయితే కారుకు కట్టిన తాడును తీయడం మరిచిపోయారు. కానీ అక్కడికి వచ్చిన ఆ సింహం తాడును నోట కరుచుకొని కారు ముందుకు వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేసినది. కారు ఆగకుండా ముందుకు వెళ్లడంతో తాడు పట్టుకొని కొంతదూరం వచ్చిన ఆ సింహం తరువాత తాడును వదిలేసినది. దీంతో కారులో ఉన్న ప్రయాణికులు హమ్మయ్యా బతికి బయటపడ్డాం అని ఊపిరి పీల్చుకున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: