ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ కొణిజేటి రోశ‌య్య మృతి వార్తను టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ద్వారా స‌మాచారం తెలుసుకున్న ఏఐసీసీ మాజీ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ రోశ‌య్య కుమారుడు శివ‌తో ఫోన్‌లో సంభాసించారు. సంతాపం ప్రకటించి సానుభూతి వ్యక్తం చేసారు. తొలుత కేవీపీ రాంచంద‌ర్‌రావుతో ఫోన్ లో మాట్లాడిన రాహుల్ గాంధీ ఆ త‌రువాత కేవీపీ రోశ‌య్య కుమారుడు శివ‌తో ఫోన్ లో మాట్లాడించారు.

కాంగ్రెస్ పార్టీకి రోశ‌య్య ఎన్నో సేవ‌లు చేసార‌ని.. ఆయ‌న అనుబంధాన్ని గురించి రాహుల్‌గాంధీ వివ‌రించారు. అదేవిధంగా కేవీపీ రోశ‌య్య మృతి గురంచి రాహుల్ గాంధీకి ఫోన్‌లో వివ‌రించారు. రోశ‌య్య గొప్ప ఆర్థిక‌వేత్త అని, ఆయ‌న మృతి ప‌ట్ల సంతాపం తెలిపారు. ఉద‌యం నుంచే రోశ‌య్య క‌న్నుమూసారనే వార్త‌ను తెలుసుకున్న ప‌లువురు నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు రోశ‌య్య పార్థివ దేహానికి నివాళుల‌ర్పించి.. సంతాపం తెలుపుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు  రేవంత్ రెడ్డి  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: