తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ తో పాటు మృతి చెందిన లాన్స్ నాయక్ సాయితేజ భౌతికకాయానికి బెంగళూరులోని ఐఏఎఫ్ అధికారులు నివాళులర్పించారు. సాయి తేజ పార్థివ దేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలిని ఘటించారు. డిసెంబర్ 08న తమిళనాడులో చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో తెలుగు రాష్ట్రానికి చెందిన సాయి మృతి చెందిన విషయం విధితమే.
తెలుగు బిడ్డ లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబసభ్యులు తొలుత తాము మాత్రం ఢిల్లీ రాలేని పరిస్థితుల్లో ఉన్నామని.. శరీరంపై ఉన్న గుర్తుల ఆనవాళ్లకు సంబంధించిన క్లోజ్ అప్ ఫోటోల ద్వారా తెలియ పరిస్తే గుర్తుపట్టగలం అని సమాధానం చెప్పారు. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువ రేగడవారిపల్లెకు చెందిన లాన్స్ నాయక్ సాయితేజ తమ్ముడు మహేష్ కూడా ఆర్మీలోనే పని చేస్తున్నారు.
సాయితేజ పార్థివదేహాన్నిఇవాళ ఢిల్లీ నుంచి బెంగళూరుకు తీసుకొచ్చారు. రేపు సాయితేజ అంత్యక్రియలు రేగడవారిపల్లెలో నిర్వహించనున్నట్టు సాయితేజ తమ్ముడు మహేష్ తెలిపారు. మరోవైపు ఎగువరేగడకు చెందిన లాన్స్‌నాయక్ సాయితేజ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించినది. రూ. 50లక్షలు అందించాలని ఇవాళ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.