క‌రోనా మ‌హమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్న వేళ‌లోనే ఒమిక్రాన్ వ్యాప్తి చెంద‌డంతో దేశ‌వ్యాప్తంగా రెండింటి కేసులు భారీగానే న‌మోదు అవుతూ ఉన్నాయి.  ఇక‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అయితే క్ర‌మంగా పెరుగుతూ ఉన్నాయి. గ‌తంలో క‌రోనా ఫ‌స్ట్‌, సెకండ్ వేవ్‌ల‌లో ఎన్టీఆర్ ట్ర‌స్ట్ కోవిడ్ బాధితుల‌కు సేవ‌లు అందించింది. ప్ర‌స్తుతం క‌రోనా ర‌క్క‌సి కోర‌లు చాస్తున్న త‌రుణంతో కోవిడ్ బాధితుల కోసం ఎన్టీఆర్ ట్ర‌స్ట్ మ‌ళ్లీ రంగంలోకి వ‌చ్చింది. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ మేనేజింగ్ ట్ర‌స్టీ భువ‌నేశ్వ‌రి సూచ‌న‌ల‌తో సేవ‌లు పునఃప్రారంభం అయ్యాయి. క‌రోనా బాధితుల‌కు టెలిమెడిసిన్ కోసం వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసారు.  

ఆన్‌లైన్ ద్వారా వైద్యుల‌తో కోవిడ్ బాధితులు మాట్లాడే అవ‌కాశమును క‌ల్పించారు. రాష్ట్రంలోని నిపుణుల‌తో వైద్య బృందం ఏర్పాటు చేసారు. ఈ వైద్య బృందంలో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్వ‌ర‌రావు కూడా ఉన్నారు. రోజూ ఉద‌యం 7 గంట‌ల నుంచి ఆన్‌లైన్‌లో కోవిడ్ రోగుల‌కు సూచ‌న‌లు చెప్ప‌నున్నారు. రోగుల కోసం ఎన్టీఆర్ ట్ర‌స్ట్ మందులు, కిట్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ‌త ఏడాది రూ.175 కోట్ల‌తో ఎన్టీఆర్ ట్ర‌స్ట్ సేవ‌ల‌ను అందించింది. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ కోవిడ్ వేళ ల‌క్ష‌లాది మందికి ఇంటి వ‌ద్దే ఆహారం అందించినది.


మరింత సమాచారం తెలుసుకోండి: