అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్ ఆరోగ్యమంత్రిని ఆ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. విజయ్ సింగ్లాను వెంటనే అరెస్ట్ చేయాలని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆదేశించారు. విజయ్ సింగ్లాపై అవినీతి ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన పంజాబ్ సీఎం.. ఆయన్ను పదవి నుంచి తీసేశారు. విజయ్ సింగ్లాను కేబినెట్ నుంచి తొలగిస్తూ కఠిన నిర్ణయం తీసుకున్నామని.. ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించానని సీఎం మాన్ తెలిపారు.

అవినీతికి పాల్పడినట్లు ఆరోగ్యమంత్రి అంగీకరించారన్న భగవంత్ మాన్ ... తమ ప్రభుత్వం అవినీతిని ఏమాత్రం ఉపేక్షించదన్నారు. కాంట్రాక్టుల విషయంలో కమీషన్ ఇవ్వాలంటూ పంజాబ్ ఆరోగ్యమంత్రి డిమాండ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే వారు సొంత పార్టీ నేతలైనా సరే చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పష్టం చేశారు. శభాష్‌ కేజ్రీవాల్‌..


మరింత సమాచారం తెలుసుకోండి: