అమృతం.. మరణం లేకుండా చేసే అద్భుతం.. మరి అలాంటి అమృతం ఎవరికైనా దొరికితే ఏం చేస్తారు.. ఇదో ఆసక్తికరమైన ప్రశ్నే.. అలాంటి అమృతం దేవతలు, రాక్షసులకు దొరికితే ఎంత గొడవ అయ్యిందో పురాణాల్లో ఉంది కదా.. మొత్తానికి అమృతాన్ని రాక్షసులు, దేవతలే పంచుకున్నారు. అయితే.. అదే అమృతం తల్లితండ్రులకు దొరికితే వారు తాగకుండా పిల్లలకు ఇస్తారని.. అదే కన్నప్రేమ అని అంటారు.


అయితే.. అదే అమృతం చంద్రబాబుకు దొరికితే  తన కుటుంబానికి తన వర్గానికి మాత్రమే పంచుతాడని మంత్రి ధర్మాన ప్రసాదరావు అంటున్నారు. అదే అమృతం జగన్‌ గారికి దొరికితే మాత్రం దాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చి, వారికి మేలు చేస్తారని చెబుతున్నారు. ఈ విధంగా ఎవరైనా చేస్తారా.. ఇలా చేయడం జగన్‌ వల్లనే సాధ్యం అంటూ కొత్త పద్దతిలో పొగిడేస్తున్నారు మంత్రి ధర్మాన.


మరింత సమాచారం తెలుసుకోండి: