రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి జలక్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే విపక్షాలను ఏకం చేసే పనిలో పడింది. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ నేత సోనియాగాంధీ ప్రతిపక్ష పార్టీల నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. ఇప్పటికే డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీతో ఆమె మాట్లాడారు. ఇంకా పలు పార్టీల నేతలతో చర్చలు  జరుపుతున్నారు. విపక్ష పార్టీల నేతలతో చర్చలు జరిపి రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం తీసుకురావాలని ఆమె భావిస్తున్నారు. ఈ బాధ్యతను పార్టీ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గేకు అప్పగించారు. ఎన్డీయేతర, యూపీయేతర పార్టీల నేతలను కలిసి వారు సూచించిన అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్‌ తెలుసుకుంటుంది. వారిలో ఒకరిని ఎంపిక చేసి ఉమ్మడి అభ్యర్థిగా నిలిపే ప్రయత్నం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: