బాలిక అత్యాచారం కేసులో ఓ నిందితుడికి ఎల్బీ నగర్ కోర్ట్ 20 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. -2015లో బాలాపూర్ కి చెందిన మైనర్ బాలిక ను ఇద్దరు నిందితులు అత్యాచారం చేశారు. బాలిక పై అత్యాచారం చేసిన అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఒడిశాకి చెందిన రషీద్, చార్మినార్ కి చెందిన అక్బర్ ఖాన్ అత్యాచారం చేశారు.


బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే.. కేసు  దర్యాప్తులో ఉండగానే నిందితుడు అక్బర్ మరణించాడు. సరైన ఆధారాలతో బాలాపూర్ పోలీసులు కోర్టుకు సమర్పించడంతో రషీద్‌ నేరం రుజువైంది. విచారణ జరిపిన కోర్టు నిందితుడు రషీద్ కు 20ఏళ్ళ కఠిన కారాగార  శిక్ష విధించింది. అలాగే మరో 2వేల జరిమానా విధించింది. బాలికకు బాధితుల పరిహార పథకం కింద రూ.5లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: