సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి.. ఏదోలా మాయ చేసిన మన ఖాతాల్లో సొమ్ము నొక్కేస్తారు. అందుకు అనే కొత్త మార్గాలు కనుగొంటున్నారు. తాజాగా పెళ్లి సంబంధాల వెబ్ సైట్లలో మాటు వేసి మోసాలు ఎక్కువగా చేస్తున్నారు. మ్యాట్రీమోనీల్లో పేర్లు నమోదు చేసుకుని.. పెళ్లి సంబంధాల పేరుతో మోసాలు చేసే కేసులు ఎక్కువయ్యాయి.

తాజాగా పెద్దపల్లి జిల్లాలో  పెళ్లి పేరుతో ఇద్దరు యువతులను మోసగించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తెలుగు మ్యాట్రిమోనీలో పరిచయమైన ఇద్దరిని ఈ ఖిలాడీ మోసగించాడు. కాకినాడకు చెందిన సూర్య ప్రకాశ్.. ఇద్దరు యువతులను మోసగించాడు. గోదావరిఖనికి చెందిన యువతి వద్ద నుంచి మాయమాటలతో ఏకంగా రూ.23 లక్షలు వసూలు చేశాడు. గోదావరిఖనికి చెందిన మరో యువతిని కూడా ఇతడు మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశారు. అతడి వద్ద రూ.14 లక్షలు, 2 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అమ్మాయిలూ కాస్త జాగ్రత్త.  


మరింత సమాచారం తెలుసుకోండి: