కర్నూలు పశ్చిమ ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టి సారించండి.. ఇదీ సీఎం జగన్ సాగునీటి పారుదల శాఖ అధికారులతో చెప్పిన మాట. సాగునీటి పారుదల సమీక్ష సందర్భంగా సీఎం జగన్ ఈ మటాలు చెప్పారు. దశాబ్దాల తరబడి పశ్చిమ కర్నూలు ప్రాంతం బాగా వెనకబడి ఉందన్న సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. నీటి వసతుల పరంగా, సౌకర్యాల పరంగా అత్యంత వెనకబడ్డ ప్రాంతం ఇదేనని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

దశాబ్దాలుగా ఇక్కడ నుంచి కొనసాగుతున్న వలసలను నివారించడానికి తగిన కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులకు సూచించారు. భూమిలేని వారికి కనీసం ఒక ఎకరా భూమినైనా ఇవ్వాలన్న సీఎం జగన్... ఈ ప్రాంతంలో ఇరిగేషన్, తాగునీటి పథకాలను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. మరి సీఎంగా కర్నూలుకు సీఎం జగన్ ఏం మేలు చేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: