శ్రీలంక సంక్షోభంపై అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్‌ స్పందించింది. శ్రీలంకలోని ప్రస్తుత పరిస్థితులపై తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్‌ ప్రకటించింది. ఆ దేశంలోని ప్రస్తుత పరిస్థితికి పరిష్కారం లభించాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్‌ ఆకాంక్షించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్‌ మద్దతు ప్రోగ్రాంపై త్వరగా చర్చలు తిరిగి ప్రారంభం కావాలని వ్యాఖ్యానించింది.


ఈమేరకు అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్‌ సమాచార విభాగం ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని శ్రీలంక మీడియా తెలిపింది. శ్రీలంక అధికార వర్గాలతో ఉన్నతస్థాయి చర్చలు మొదలుకావాల్సి ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్‌ ప్రకటించింది. సాధ్యమైనంత త్వరగా చర్చలు ప్రారంభమవుతాయని ఆశిస్తున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్‌ ప్రతినిధి ఆకాంక్షించారు. శ్రీలంక అప్పులు నిలకడలేని విధంగా ఉన్నాయంటున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్‌.. మద్దతు ప్రోగ్రామ్ ను బోర్డు ఇంకా ఆమోదించాల్సి ఉందని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: