వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశం కల్పించే నీట్‌ పరీక్ష ఇవాళ దేశవ్యాప్తంగా జరగనుంది. ఏపీ నుంచి సుమారు 60వేల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. నీట్ కోసం తెలంగాణలో 25 పట్టణాలు, నగరాల్లో 115 కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ తో పాటు 25 నగరాలు, పట్టణాల్లో 115 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఈ ఏడాది పరీక్ష సమయాన్ని 20 నిమిషాలు అదనంగా ఇచ్చారు. నీట్‌ పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు నిర్వహిస్తారు.


ఈ నీట్‌ పరీక్ష కు వచ్చే వారు ఆభరణాలు, బూట్లు, పొడవు చేతుల చొక్కాలు, పర్సు, చేతిగడియారాలు తీసుకురాకూడదు. వీటికి అనుమతి ఉండదు. రాత పరీక్షకు కేంద్రంలోనే పెన్ను కూడా ఇస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. ఈ నీట్ పరీక్ష దేశవ్యాప్తంగా 543 నగరాల్లో జరుగుతుంది. అంతే కాదు.. విదేశాల్లోనూ 13 నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది సుమారు 16 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ నుంచి దాదాపు 60వేల మంది నీట్ రాస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: