ఏపీ సీఎం  జగన్ కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏపీ సీఎం జగన్.. నవరత్నాలను అమలు చేయడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవంటున్న కేఏ పాల్‌..  తనతో కలిస్తే పరిష్కారం చూపిస్తా అన్నారు. లేకపోతే.. జగన్ తన పార్టీలో చేరితే అన్ని తానే చూసుకుంటానని కేఏ పాల్‌ చెప్పారు. పవన్ ని ఉద్దేశించి కూడా కేఏ పాల్‌  మాట్లాడారు. ఈ అన్నయ్యతో కలిస్తే అంతా మంచే జరుగుతుందన్నారు.తమ్ముడు ముందుకు వస్తే కలిసి పని చేస్తామని కేఏ పాల్‌  అన్నారు.

పాల్ రావాలి పాల్ తోనే పాలన మారాలి అనే నినాదంతో ప్రజాశాంతి పార్టీ ప్రజలలోకి వెళుతుందనికేఏ పాల్‌  అన్నారు. ఈవీఎంలపై తనకు నమ్మకం లేదని, బ్యాలెట్ విధానమే మంచిదని కేఏ పాల్ అంటున్నారు.  ఈవీఎం లతో ఎన్నికలు జరిగితే మళ్లీ బీజేపీని అధికారంలోకి వస్తుందని కేఏ పాల్  అన్నారు. ఏపీ రాష్ట్రం నాశనం కావడానికి ఆ నలుగురు కారణం అన్నారు. మోడీ, బాబు , జగన్, పవన్ లే రాష్ట్ర నాశనానికి కారణమని కేఏ పాల్  అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: