రోహింగ్యాలు.. బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన కాందీశీకులు.. సాధారణంగా వీరు ముస్లింలే ఉంటారు. హైదరాబాద్‌లో వీరు పెద్ద ఎత్తున ఉన్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తుంటారు. అయితే.. ఇలాంటి రోహింగ్యాలను తెలంగాణ సర్కారు కొన్నాళ్లుగా జైల్లో పెట్టింది. ఇప్పుడు హైదరాబాద్ లో రోహింగ్యాల నిర్బంధాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. రోహింగ్యాలను చర్లపల్లి జైళ్లో నిర్బంధించడం చట్ట విరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది.


అనుమతి లేకుండా హైదరాబాద్ లో ఉన్న రోహింగ్యాలను పోలీసులు గతేడాది జైలుకు తరలించారు. పోలీసుల నిర్ణయాన్ని హైకోర్టులో పలువురు రోహింగ్యాలు సవాల్ చేశారు. జైలుకు తరలించే అధికారం రాష్ట్ర ప్రభుతానికి లేదని రోహింగ్యాల వాదించారు. రోహింగ్యాలపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికే ఉంటుందని రోహింగ్యాల తరపు న్యాయవాదులు వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన హైకోర్టు రోహింగ్యాల నిర్బంధ ఉత్తర్వులు కొట్టివేసింది. తనకు లేని అధికారాన్ని తెలంగాణ సర్కారు ఉపయోగించినట్టు అయ్యింది. రోహింగ్యాలను కేంద్రానికి అప్పగించకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం వివాదస్పదం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: