ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు వైఎస్సార్ వర్శిటీగా మార్చడంపై రచ్చ రచ్చ సాగుతోంది. ఇలా పేరు మార్చడం అత్యంత హేయమైన చర్య అంటున్నారు టీడీపీ నాయకులు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన దగ్గర నుండి పేర్లు మార్చడం, ఊర్లు మార్చడం తప్ప కొత్తగా చేసింది ఏమీ లేదని టీడీపీ నాయకులు వ్యాఖ్యానించారు. పేరు మార్పుపై ఎన్టీఆర్ భార్యనని చెప్పుకునే లక్ష్మిపార్వతిగానీ, వైసీపీలో ఉన్న కొడాలి నాని గానీ ఎందుకు మాట్లాడటం లేదని టీడీపీ నాయకులు ప్రశ్నించారు.


జగన్మోహన్ రెడ్డి.. నీకు చేతనైతే కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి దానికి మీ నాన్న పేరు పెట్టుకోవాలని టీడీపీ నాయకులు సూచించారు. యూనివర్శిటికి ఎన్టీఆర్ పేరు కొనసాగించకపోతే ప్రజా ఉద్యమం చేసి ప్రభుత్వాన్ని గద్దె దించుతామని టీడీపీ నాయకులు హెచ్చరించారు. నిజంగానే మరి ఈ పేరు మార్పుపై కొడాలి నాని, లక్ష్మీ పార్వతి ఎలా స్పందిస్తారో?


మరింత సమాచారం తెలుసుకోండి: