సీఎం జగన్ పన్నులతో ప్రజలను బాదుతున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. సైకో ముఖ్యమంత్రి పాలనలో ధరలు, చార్జీలు, పన్నులు విపరీతంగా పెరిగాయన్నారు. నియోజకవర్గాల ప్రగతి కోసం వేల కోట్లు కేటాయించామంటోన్న ప్రభుత్వం.....అవి ఎక్కడ ఖర్చు చేశారో వెల్లడించాలని టీడీపీ నేత నారా లోకేశ్‌ డిమాండ్ చేశారు. ప్రగతి పనుల కోసం ఒక్క రూపాయి నిధులు సాధించలేని  శాసనసభ్యులు.. పన్నుల పేరుతో అధికారులకు టార్గెట్లు విధించడం దారుణమని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. చివరికి ఖాళీ స్థలాలనీ వదలకుండా పన్నులు వసూలు చేయాలని ఆదేశించడం ఎమ్మెల్యే దోపిడీ బుద్ధికి నిదర్శనమని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పేదలకు ఒక్క ఇల్లూ కట్టలేని ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి వేలాది ఇళ్లు కూల్చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: