దిల్లీ మద్యం కేసులో కేసీఆర్ కుమార్తె కవిత అరెస్టు తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. తనపై వచ్చిన ఆరోపణలపై ఇటీవల స్పందించిన కవిత వాటిని తప్పుబట్టలేదు.. తనకు ఈ కేసుతో సంబంధం ఉందని ఒక్కమాట కూడా చెప్పలేదు.. కావాలంటే అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అనడం విశేషం. దీన్ని బట్టి కవిత లోపల అరెస్టు చేస్తారనే భయం దాగి ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.


సీబీఐ ఎంక్వయిరీ లో కవిత పేరు పెట్టింది కాబట్టి అరెస్ట్ తప్పదన్న వాదన వినిపిస్తోంది. సాధారణంగా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు.. అదంతా అబద్దం.. ఈ కేసుకూ నాకు ఏం సంబంధం లేదు.. ఏం విచారణ చేసుకుంటారో చేసుకోండి.. అంటూ నేతలు దబాయిస్తారు.. కానీ కవిత మాత్రం అలాంటి వ్యాఖ్యలు చేయలేదు.. పైగా అరెస్టు చేసుకోండని చెప్పడం అంటే.. ఈ కేసులో ఆమె పాత్రను కొట్టిపారేయలేమంటున్నారు. అరెస్టు తప్పదని ముందుగా తెలిసినందువల్లే.. అందుకు ఆమె సిద్ధమైపోయారన్న వాదన వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: