అమెరికా అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం చేరింది. అమెరికా రక్షణ శాఖ అత్యాధునిక యుద్ధ విమానాన్ని సాధించింది. అత్యాధునిక స్టెల్త్  బాంబర్ యుద్ధ విమానం బి-21 రైడర్ అమెరికా ఆర్మీలో చేరింది. దీన్ని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్  ఆస్టిన్  కాలిఫోర్నియాలో ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యాధుని సైనిక బాంబర్ గా ఈ యుద్ధవిమానానికి పేరుంది. ఇది కేవలం విమానం మాత్రమే కాదని అమెరికా సంకల్పానికి ప్రతిరూపమని ఆస్టిన్ అంటున్నారు.

ఇక ఈ స్టెల్త్ బాంబర్‌ వివరాల్లోకి వెళ్తే..  ఈ బీ-21 రైడర్ ను నాథ్రాప్  గ్రమ్మన్  సంస్థ తయారు చేసింది. ఒక్కో బి-21 రైడర్  ఖరీదు మన రూపాయల్లో సుమారు 17వేల కోట్లుగా ఉంటుంది. సంప్రదాయ, అణ్వాయుధాలతోపాటు లేజర్  ఆయుధాలనూ ప్రయోగించే సామర్థ్యం బీ-21 రైడర్ సొంతం. ఈ బీ-21 రైడర్.. ప్రత్యర్థులకు చిక్కకుండా, దొరకకుండా తప్పించుకుంటుంది. ప్రపంచంలో ఏ లక్ష్యాన్నైనా బీ-21 రైడర్ ఛేదించగలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: