రాయలసీమ గర్జనకు హాజరుకాని వారు ఆ ప్రాంత దోషులుగా మిగిలిపోతారంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తాజాగా కామెంట్‌ చేయడం వివాదస్పదం అవుతోంది. బుగ్గన ఇలా సినిమా డైలాగ్స్‌ చెప్పడం సరికాదని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్‌ అన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు బీజేపీ డిక్లరేషన్‌లో ఉందని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్‌ తెలిపారు. మనసావాచా కర్మనా ఆ ప్రక్రియ ముందుకు వెళ్లకుండా చేసింది ఎవరని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్‌ ప్రశ్నించారు.


రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి, పెండింగ్‌ ప్రాజెక్టుల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ నుంచి లేఖ రాసినా ఇంతవరకు సానుకూల స్పందన రాలేదని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్‌ అన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని టీజీ వెంకటేష్‌ విమర్శించారు. ప్రాజెక్టుకు ఎందుకు కొట్టుకుపోయిందని.. ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్నలకు బదులే లేదని టీజీ వెంకటేష్‌ అన్నారు. కొత్త ప్రాజెక్టు లు కూడా మొదలు పెట్టడం లేదని... బుండేల్ , సిద్దేశ్వరం, సరస్వతి, అన్నమయ్య  హంద్రీనీవా ప్రాజెక్టు లు గురించి పట్టించుకోవడం లేదని టీజీ వెంకటేష్‌ ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: