ఈటల రాజేందర్‌ ఒకప్పుడు ఆర్థిక మంత్రి.. ఇప్పుడు విపక్ష నేత.. కానీ.. తాము ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న టిఫిన్‌ తినేందుకు కూడా చోటు లేదని సభలో ఆయన లేవనెత్తిన అంశం చర్చనీయాంశం అయ్యింది. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను మంత్రులు అడుగడుగున అడ్డుకుని.. బడ్జెట్‌పై కాకుండా ఇతర అంశాలపై మాట్లాడడం ఏమిటని మంత్రులు, ఎమ్మెల్యేలు నిలదీశారు. బడ్జెట్‌పై చర్చ చేయకముందే...తమ పార్టీకి ప్రత్యేకంగా కార్యాలయం కేటాయించాలని అసెంబ్లీ వేదికగా ఈటల స్పీకర్‌కు విజ్ఞప్తి చేయడంపై మంత్రులు మండిపడ్డారు.

ఈటల వ్యాఖ్యలను తప్పుబట్టిన మంత్రి హరీష్ రావు...ఐదుగురు సభ్యులు ఉన్న పార్టీకే ఆఫీస్ కార్యాలయం ఇచ్చే సంప్రదాయం ఉందంటే.. తిరిగి స్పందించిన ఈటల రాజేందర్‌...అన్ని సంప్రదాయాల ప్రకారమే జరగవని, కొన్ని అవసరాలను బట్టి కూడా జరుగుతాయన్నారు. మంత్రి ప్రశాంత రెడ్డి జోక్యం చేసుకుని...సౌకర్యాల గురించి ప్రస్తావించే వేదిక ఇది కాదని స్పష్టం చేయగా..  20 సంవత్సరాల తరవాత తాను సభాసంప్రదాయాల గురించి నేర్చుకోవాలా అధ్యక్షా అన్నారు ఈటెల.


మరింత సమాచారం తెలుసుకోండి: