మహిళలు, ప్రజా ప్రతినిధులను కించపర్చే విధంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ పెరిగింది. అలా పోస్టులు పెడుతున్న యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సైబర్ క్రైం డీసీపీ స్నేహ మెహ్రా హెచ్చరించారు. మద్యం పాలసీలో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్నారని డీసీపీ స్నేహ మెహ్రా తెలిపారు. దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే నిందితులుగా తేలుస్తూ యూట్యూబ్ చానళ్ల నిర్వాహకులు ట్రోలింగ్ చేస్తున్నారని... వ్యూస్ కోసమే ఇలా చేస్తున్నారని డీసీపీ స్నేహ మెహ్రా తెలిపారు.


ఇలాంటి ఛానళ్లపైనా చర్యలు తీసుకోవాలని యూట్యూబ్ కు సైతం లేఖలు రాస్తామని డీసీపీ స్నేహ మెహ్రా తెలిపారు. మొత్తం 20 యూట్యూబ్ ఛానళ్లపై కేసులు నమోదు చేశామని డీసీపీ స్నేహ మెహ్రా వివరించారు. అందులో 8 యూట్యూబ్ ఛానళ్ల ప్రతినిధులను గుర్తించి అరెస్ట్ చేశామని డీసీపీ స్నేహ మెహ్రా తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లు ఇందులో ఉన్నారని డీసీపీ స్నేహ మెహ్రా వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: