చట్టం చేతులు చాలా పెద్దవి.. తప్పు చేస్తే ఎప్పటికైనా ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది. అయితే అందుకు చాలా సమయం పట్టొచ్చు. ఈ విషయాన్ని ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారికి జైలు శిక్ష పడిన ఘటన మరోసారి రుజువు చేస్తోంది. మిజోరం విశ్రాంత ఐఏఎస్ అధికారి కవాడి నర్సింహాకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. కవాడి నర్సింహా అనే ఐఏఎస్‌ 1991 నుంచి 2006 మధ్య ఆదాయానికి మించి ఆస్తులు సమకూర్చుకున్నారని అభియోగం వచ్చింది.


కవాడి నర్సింహా ఆదాయానికి మించి రూ.32 లక్షల ఆస్తులు కూడబెట్టుకున్నారని సీబీఐ అభియోగం మోపింది. కవాడి నర్సింహా 2006లో సీబీఐ కేసు నమోదు చేసి 2010లో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది హైదరాబాద్ సీబీఐ. ఏళ్ల తరబడి విచారణ జరిగిన తర్వాత కవాడి నర్సింహాకు మూడేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధిస్తూ హైదరాబాద్ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. అంటే.. దర్జాగా ఐఏఎస్‌గా జీవితమంతా బతికిన వ్యక్తి ఇప్పుడు రిటైర్ అయ్యాక జైల్లో కూర్చోవాల్సి వస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: