ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో రైసుమిల్లుల ఏర్పాటుకు నాలుగైదు నెలల్లో భూముల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌ల ఏర్పాటు, పురోగతిపై పరిశ్రమల శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఆహార, వ్యవసాయ రంగంలో ప్రతి జిల్లాలో డిమాండ్, సాధ్యాసాధ్యాల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు నిర్ణయం ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమని సీఎస్‌ శాంతి కుమారి అన్నారు.

పెట్టుబడిదారుల నుంచి డిమాండ్ ఉన్న ఏడు ప్రదేశాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ప్రోత్సహించేందుకు వ్యూహాన్ని రూపొందించాలని సీఎస్‌ శాంతి కుమారి  అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరుగుతున్న నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో రైస్ మిల్లుల ఏర్పాటును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సీఎస్‌ శాంతి కుమారి అన్నారు. మధ్యమానేరు జలాశయంలో ఆక్వా హబ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎస్‌ శాంతి కుమారి  అధికారులను కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts