ఏపీ సీఎం జగన్ తీసుకొచ్చిన కొత్త వ్యవస్థ సచివాలయ వ్యవస్థ. ఈ వ్యవస్థను మొదట్లో టీడీపీ వ్యతిరేకించింది. టీడీపీ మీడియా కూడా తప్పుబట్టింది. అయితే.. మరి ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను తీసేస్తామనే దమ్ము ఉందా అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. - జగన్‌పెట్టిన వాలంటీర్‌ సిస్టమ్, సచివాల వ్యవస్థను తీసేస్తానని, ఆయన అమలు చేస్తున్న పథకాలు రద్దు చేస్తామని ఏ పార్టీనైనా చెప్పమనండి చూద్దాం అంటూ వైసీపీ నేతలు సవాల్ విసురుతున్నారు.

అమరావతి ఎక్కడికెళ్లిందని ప్రశ్నిస్తున్న వైసీపీ నేతలు.. అది అక్కడే ఉందని.. అమరావతితో పాటు విశాఖపట్నం పెడుతున్నామని అంటున్నారు. అమ్మకు అన్నం పెట్టని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు అన్నట్లు చంద్రబాబు ఎన్నైనా చెప్తాడని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. చేయని వాటికి చంద్రబాబు ఎన్నైనా హామీలు ఇచ్చేస్తాడంటున్న వైసీపీ నేతలు నోటితో చెప్పే దానికి నోటు ఇచ్చేదానికి తేడా ఉందని గుర్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: