ఏపీ సీఐడీ మరోసారి రామోజీరావుకు షాక్ ఇచ్చింది. ఏపీ సీఐడీ మార్గదర్శి అంశంలో ఇప్పటికే రెండు సార్లు ఆస్తులు జప్తు చేసింది. రెండు జీవోల ద్వారా రూ.1035 కోట్ల ఆస్తులను జప్తు చేసిన సంగతి తెలిసిందే. జీవో 104, జీవో 116 ద్వారా రూ.1035 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసింది. మళ్లీ ఇప్పుడు తాజాగా జీవో 134 ద్వారా ఉషాకిరణ్‌ మీడియా లిమిటెడ్‌, ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్‌ ప్రై.లిమిటెడ్‌లో మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ పెట్టిన రూ.15.81 కోట్ల విలువైన షేర్‌ క్యాపిటల్‌ను ఏపీ హోంశాఖ అటాచ్‌ చేసింది.

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థ.. ఉషాకిరణ్‌ మీడియా ప్రై.లిమిటెడ్‌లో 88.5 శాతం, ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్‌ ప్రై.లిమిటెడ్‌లో 44.55 శాతం వాటా కలిగిఉందని ఏపీ సీఐడీ ఎస్పీ అమిత్ బర్దార్‌ తెలిపారు. మొత్తానికి మార్గదర్శి అంశంలో ఏపీ సీఐడీ జగన్‌ డైరెక్షన్‌లో రామోజీని ముప్పు తిప్పలు పెట్టేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: