ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ లో మూడో విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ జరగనుంది. మూడో విడతలో 19 వేల 20 మందికి ఇళ్లను తెలంగాణ ప్రభుత్వం అందించనుంది. దుండిగల్ లో 3,142 ఇళ్లను హోంమంత్రి మహమూద్ అలీ అందించనున్నారు.  శంకర్ పల్లిలో 1361 ఇళ్లను మైనింగ్ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అందించనున్నారు. మన్ సాన్ పల్లిలో 2099 ఇళ్లను విద్యా శాఖ మంత్రి సబితా అందించనున్నారు. నల్లగండ్ల లో 344 ఇళ్లను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అందించనున్నారు.

నార్సింగ్ లో 356 ఇళ్లను అందించనున్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కొల్లూరు -2 లో 6067 ఇళ్లను అందించనున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, అహ్మద్ గూడ లో 1965 మంది లబ్దిదారులకు ఇండ్లను అందించనున్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, రాంపల్లి లో 3214 లబ్దిదారులకు ఇళ్లను అందించనున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR