తెలంగాణ రాజకీయాల్లో కన్నడ నేతల హవా నడుస్తోంది. కన్నడ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు. మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్ ఇప్పటికే ప్రచారం నిర్వహించారు. ఇక ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్సీలు కూడా రంగంలోకి దిగారు. కర్ణాటకలో డబులింజన్‌ సర్కారు నినాదంతో వచ్చిన భాజపాను ప్రజలు ఓడించారని కర్ణాటక ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్‌ తెలిపారు. తెలంగాణలోనూ ట్రిబులింజన్ పేరుతో భాజపా, భారాస, ఎంఐఎం లు కలిసి పనిచేస్తున్నప్పటికీ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారని కర్ణాటక ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిందని బీకే హరిప్రసాద్‌ అన్నారు.


కేసీఆర్ తన కూతురు జైలుకు వెళ్లకుండా కాపాడుకుంటున్నారని.. తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్‌ పాలసీ నుంచి వచ్చిన డబ్బులతోనే భారాస ఎన్నికలకు వెళ్లిందని బీకే హరిప్రసాద్‌  ఆరోపించారు. కేసీఆర్‌ అబద్దాలు మాట్లాడుతున్నారని.. కర్ణాటకలో రైతులకు సరిపడా 10గంటల కరెంటు ఇస్తున్నామని బీకే హరిప్రసాద్‌ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: