తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. తెలంగాణలో 35,655 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్ మొదలైంది. మొత్తం 106 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి మొదలైన పోలింగ్ సాయంత్రం 5 వరకు జరుగుతుంది. అయితే 13 నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 వరకు మాత్రమే పోలింగ్‌ జరగుతుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది.

ఆ నియోజక వర్గాలు ఏమిటంటే.. సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాలలో సా.4 వరకు పోలింగ్‌ వరకే పోలింగ్ జరుగుతుంది. అలాగే ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లిలో సా.4 వరకు పోలింగ్‌ జరుగుతుంది. ములుగు, పినపాక, ఇల్లందులో సా.4 వరకు పోలింగ్‌ జరుగుతుంది. కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలంలోనూ సాయంత్రం 4 వరకు పోలింగ్‌ జరుగుతుంది. అంటే ఈ 13 నియోజక వర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకూ క్యూలో ఉంటే చాలు.. వారందరికీ ఓటింగ్ అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: