టీడీపీ నేత నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర ఓ కామెడీ షో అంటున్నారు మంత్రి అంబటి రాంబాబు. కేవలం ఎన్టీఆర్ మనవడు అన్న ఒకే ఒక్క కారణంతో లోకేష్ రాజకీయాల్లో చెలామణి అవుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన టీడీపీకి ఒక శనిలా దాపురించిన వ్యక్తి అంటూ విమర్శించారు. రాష్ట్రం గురించి అవగాహన లేని ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ నారా లోకేష్‌కు వత్తాసు పలుకుతున్నాడని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.


ప్రస్తుతం ఏపీలో ప్రజలంతా వచ్చే ఎన్నికలైప చాలా స్పష్టంగా ఉన్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా మళ్ళీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఎన్నుకోవడానికి ప్రజలంతా ఇప్పటికే సిద్ధంగా ఉన్నార‌ని మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు.
అందుకు కారణం కూడా మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. ఎన్నికల మ్యానిపెస్టోలోని సంక్షేమ పథకాలన్నీ అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అని మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: