వైసీపీలోని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ షాక్ ఇచ్చారు. 11చోట్ల ఇంచార్జీలను మార్చారు. అయితే ఇదంతా వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసమేనని పార్టీ నేతలు చెబుతున్నారు. వైసీపీ నాలుగున్నరేళ్లుగా బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగానే కార్యకలాపాలు నిర్వహించిందని.. పార్టీకి బలమైన వ్యక్తులుగా రాణించే వారినే గుర్తించి రిపోర్టులు తెప్పించుకుని ఇంఛార్జుల మార్పు చేర్పులు జరిగాయని చెబుతున్నారు.


భవిష్యత్ లోనూ ఇలాగే ఉంటుందని.. 2024 ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాం కాబట్టే శాస్త్రీయ సర్వేల ఆధారంగా మార్పు చేర్పులు చేశామని కీలక నేతలు చెబుతున్నారు. శాసనసభ్యులతో నిర్వహించిన సమావేశంలోనూ పార్టీ అధ్యక్షులు జగన్ ఎమ్మెల్యేలకు ఇదే అంశాన్ని చెప్పారంటున్న ఆ నేతలు.. ఈ మార్పు చేర్పులను వక్రీకరించి చూపాల్సిన అవసరం లేదంటున్నారు. రాజకీయ పార్టీలు వ్యక్తుల కోసం పనిచేయవని.. ఇది అంతర్గత మార్పుల్లో భాగమేనని అంటున్నారు. రాజీనామాలలాంటి అంశాలను తట్టుకోగలిగిన సామర్ధ్యం వైసీపీకి ఉందంటున్న వైసీపీ నేతలు.. ఎవరికైనా అపోహలు ఉంటే తొలగించే ప్రయత్నం చేస్తామంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: