హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైళ్లు సదుపాయం కూడా కల్పిస్తామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ తో తెలంగాణ రాష్ట్ర మొత్తం అభివృద్ధి చెందేలా ప్రణాళిక చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2050 విజన్ ప్రణాళిక  ద్వారా ముందుకు పోతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అర్బన్ తెలంగాణా, రూరల్ తెలంగాణాను సైతం అభివృద్ధి చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఫార్మా సిటీ కట్టలేదని కొంత మంది ఆరోపణలు చేస్తున్నారు.


అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ పక్కన ప్రమాద డ్రగ్ తయారీ కంపనీ ఏర్పాటు సరైనది కాదన్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రాణాలు తెగించి ప్రజల ప్రాణాలు కాపాడడంలో అగ్నిమాపక సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఎన్నో వేలాది నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే అగ్ని మాపక శాఖ భవనం లేకపోవడం మంచిది కాదు. ఏనగరంలో శాంతి భద్రతలు ఉంటాయో ఆ నగరం అభివృది చెందుతుందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

orr