క్రెడిట్ కార్డు మరియు డెబిట్ కార్డులు వాడే వారికి వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త రూల్స్ అమలు కానున్నాయని తెలుస్తుంది. తాజాగా ఈ కార్డులను వాడే వినియోగదారులకు ఆర్బీఐ బ్యాంక్ సువర్ణావకాశాన్ని అందిస్తుంది.ఈ నిర్ణయం తో ఈ కార్డులు వాడే వారికి మంచి లాభాలు ఉన్నాయని తెలుస్తుంది..కాంటాక్ట్‌లెస్ కార్డుల ట్రాన్సాక్షన్ లిమిట్‌ను పెంచుతున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుతం ఉన్న రూ.2,000 నుంచి రూ.5,000 వరకు పెంచుతున్నట్లు వివరించింది.. మరో విషయమేంటంటే పిన్ ఎంటర్ చేయకుండానే 5 వేలకు పైగా లావాదేవీలను చేసుకోవచ్చు..ఈ కొత్త రూల్స్ జనవరి 1 నుంచి అందుబాటులోకి వస్తాయి